Breaking News
recent

Happy Ram Navami Hindi Quotes | ram navami status



Happy Ram Navami Hindi Quotes | ram navami status

శ్రీరామనవమి హిందువులకు అత్యంత పవిత్రమైన రోజు. ఈ రోజు  శ్రీరాముని జన్మదినంగా శ్రీ సీతారాముల కల్యాణం గా జరుపుకుంటారు. ఈరోజు వీధులలో పెద్ద పెద్ద పందిళ్ళు వేసి శ్రీ సీతారాముల కళ్యాణం ఘనంగా జరుపుతారు.  
ఈ రోజు స్వామి వారి సన్నిధిలో కొబ్బరినూనెతో దీపారాధన చేయడం ద్వారా శుభఫలితాలు ఉంటాయి.
ఎందుకంటే ఆయా పర్వదినాలలో దీపారాధనకు ఉపయోగించే తైలం కూడా విశేషాన్ని సంతరించుకొంటుంది దీపారాధనకు కొబ్బరినూనె ఉపయోగించాలని పండితులు చెబుతున్నారు.
ఆ రోజు పూజా మందిరానికి రెండువైపులా కొబ్బరి నూనెతో చేసిన కుందులను ఉంచి  ఐదేసి వత్తులను వేసి వెలిగించాలి.
కొబ్బరినూనెతో దీపారాధన చేయడంవల్ల విశేషమైన శుభ ఫలితాలు  మన ఇంట్లో జరుగుతాయని చెపుతున్నారు.
ఎవరైతే శ్రీరామనవమి  వ్రతము భక్తిగా  ఆచరించిన వారి జన్మాంతర పాపములన్నీ నశించును.
అంతేకాదు మహాపాపాలు చేసినవారైనా ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల జన్మ జన్మల పాపాలు అన్నీ నాశనమవుతాయి.
ఈ రోజు ఏమీ చేయలేని వారు కనీసం ఉపవాసం ఉండి శ్రీ రామ నామస్మరణ చేసిన తో జన్మ జన్మల పుణ్యం లభిస్తుంది.
శ్రీరామనామాన్ని ఉచ్ఛరించేటప్పుడు రా అనగానే  మన నోరు తెరచుకుని మనలోపల పాపాలన్ని బయటకు వచ్చి ఆ రామనామ అగ్నిజ్వాలలో పడి దహించుకుపోతాయట. అలాగే మ అనే అక్షరం ఉచ్ఛరించినప్పుడు మననోరు మూసుకుంటుంది కనుక బయట మనకు కనిపించే ఆ పాపాలు ఏవీ మనలోకి ప్రవేశించలేవట.
అందువల్లనే మానవులకు రామనామ స్మరణ విజ్ఞానాన్ని జన్మరాహిత్యాన్ని కలిగిస్తుందట
Happy Ram Navami Hindi Quotes | ram navami status

No comments:

Powered by Blogger.